Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాశ్, ఉపేందర్
నవతెలంగాణ - భువనగిరి
వికలాంగుల స్వయం ఉపాధి రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురుపంగ ప్రకాశ్, వనం ఉపేందర్ కోరారు. ఆ సంఘం ఆవిర్భావ వారోత్సవాల ప్రారంభ సూచికగా మంగళవారం జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్పిఆర్డీ సంఘం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. వికలాంగులకు ప్రస్తుతం అందిస్తున్న స్వయం ఉపాధి రుణాలు జిల్లాకు 26 యూనిట్లను మాత్రమే కేటాయించారని , ప్రతి మండలానికి 20 చొప్పున జిల్లా మొత్తంలో 340 యూనిట్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలితా, జిల్లా నాయకులు కేతావత్ మురళి, కొండాపురం మనోహర్, యాదగిరి, గోపి, బానోత్ వెంకటేష్ పాల్గొన్నారు.