Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుర్కపల్లి
ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయం పొందవచ్చునని ఆయిల్ ఫామ్ మండల ఫీల్డ్ ఆఫీసర్ మౌనిక కోరారు.మంగళవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామపం చాయతీ పరిధిలోని రైతు వేదికలో రైతులతో ఆయిల్ ఫాం పంటలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ చట్టం 1993 ద్వారా రైతు ప్రయోజనాల పరిరక్షణ కలదని, ఆయిల్ ఫామ్ పంట మొక్క నాటిన నుండి నాలుగు సంవత్సరాల తర్వాత పంట మొదలై 25 సంవత్సరాల దాకా ప్రతి సంవత్సరం ఏడాది పొడుగునా ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ పంటలను పండించే రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఎకౌంటు జిరాక్స్ ,పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, రెండు పాస్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఫీల్డ్ ఆఫీసర్నీ సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, ఏఈఓ ఉమారాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు.