Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -తుర్కపల్లి
రాజకీయ నాయకుడిని కాదు, ప్రజా సేవకుడిని అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని మోతీరం తండాలో ఆయన చేపట్టిన రెండవ రోజు హాత్ సే హాత్ పాదయాత్ర పల్లె పహడ్,గొల్ల గూడెం,రామోజీనాయక్ తండా,ధర్మారం గ్రామాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బీర్ల అయిలయ్యకు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప కు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.పల్లె పహాడ్ గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం తో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాలను ప్రజలకు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హింస, మత ద్వేషంతో బీజేపీ దేశాన్ని చీల్చుతుంటే భారతావనిని ఐక్యం చేయాలానే సంకల్పంతో భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 135రోజులు, 14రాష్ట్రాలు, 4088కిలోమీటర్లు పాదయాత్రతో, ప్రేమ,శాంతి, జాతి ఐక్యత అనే నినాదంతో సాగిన రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారన్నారు. దీనికి కొనసాగింపుగా ఏఐసీసీ పిలుపు మేరకు ఆలేరు నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టినమని తెలిపారు. 'కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల్లో అన్నదాతలు ఉన్నారని తెలిపారు.దళితులకు సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని,10.లక్షల దళిత బంధు పేరుతో కేసీఆర్ మోసం చేసారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినా హామీ మర్చిపోయారన్నారు. ,ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు.ప్రజలందరీని ఈ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ మండల అధ్యక్షుడు దానవత్ శంకర్ నాయక్ ,జిల్లా నాయకులు గుడిపాటి మధుసూదన్ రెడ్డి ,ఎలు గల రాజయ్య ,ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్రెడ్డి ,కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీిలు మోహన్ బాబు నాయక్, ప్రతిభ రాజేష్ నాయక్, సర్పంచ్లు, మండల నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.