Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
పట్టణంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ను యదాతథంగా కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అఖిలపక్ష రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండును ఆధారంగా వందలాది కుటుంబాలు వచ్చే భక్తులకు సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు. పట్టణ ప్రజల కోసం భక్తుల సౌకర్యం కోసం ఆనాటి ప్రభుత్వం స్వామివారి ముఖద్వారానికి ఎదురుగా పట్టణంలో బస్టాండ్ ను ఏర్పాటు చేశారని అన్నారు. గుండం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ తో సంబంధం లేకుండానే పట్టణంలోని బస్టాండ్ యధావిధిగా కొనసాగించి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రతి బస్ సర్వీసులను ఇక్కడ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ,సింగిల్ విండో వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు మంద శంకర్, నాయకులు బబ్బురి పోశెట్టి,బబ్బురి శ్రీధర్, బీజేపీ నాయకులు బెలిద అశోక్, కాంగ్రెస్ నాయకులు కలకుంట్ల శేఖర్, మహిళా సమైక్య నాయకురాలు బండి జంగమ్మ, దీకొండ జోగయ్య, పేరబోయిన మహేందర్, బండి అనిల్, బొజ్జ సాంబెష్, మున్సిపల్ కౌన్సిలర్ దండ బోయిన అనిల్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, గుండ్లపల్లి శ్రీరామ్, , మిట్ట నర్సింగ్,ఆటో యూనియన్ నాయకులు జీ దేవేందర్, ఏస్ కే మన్సూర్ పాషా, మొగులయ్య, గుండు నరసింహ, బిట్టు హరీష్ వెంకటేష్,రాజు, నరసింహ,తదితరులు పాల్గొన్నారు.