Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ -భూధాన్పోచంపల్లి
లేబర్ కోడ్స్ రద్దు కనీస వేతనం మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు స్పెషల్ స్టేటస్.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర ముగిసే లోగా ముఖ్యమంత్రి సమస్యలను పరిష్కరించాలని జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చేరుకుంది. పాదయాత్ర బందానికి గ్రామపంచాయతీ వర్కర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ పాదయాత్ర హైదరాబాద్ చేరకముందే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు 610 మండలాలు 12600 గ్రామపంచాయతీలు సుమారు 46వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు వారికి కనీస వేతనాలు లేక వారి బతుకులు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. ధనిక రాష్ట్రంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జీతాలు పెంచుకోవచ్చు కానీ గ్రామాలలో పనిచేసే కార్మికుల జీతాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు గ్రామాలను శుభ్రం చేసే కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు కార్మికుల వెంట ఉంటామన్నారు. ప్రభుత్వ మెడలు వంచి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామన్నారు.నాలుగు నియోజకవర్గాలు 12 మండలాలలో యాదాద్రి భువనగిరి జిల్లా లో ఆరు రోజులపాటు రెండు నియోజకవర్గాల్లో ఏడు మండలాలు సుమారు 40 గ్రామాలలో 200 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిందన్నారు. గ్రామాలలో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులను 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మందికి ఒకరిని నియమించారని 12 ఏండ్లలో జనాభా పెరిగినవారికి తగ్గట్టుగా కార్మికులను పెంచలేదని విమర్శించారు. తెలంగాణలో మల్టీ పర్పస్ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల కారోబార్ పరిస్థితి దీనంగా మారిందన్నారు. ఆయా రంగాల్లో పదోన్నతులు, గ్రేడింగ్‌లు ఉన్నట్లుగానే గ్రామపంచాయతీలోని పునర్ధ్దరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం జీపీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలన్నారు. పంచాయతీ కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5,50,000 ఆర్థిక సాయం ప్రభుత్వం వెంటనే అందించాలి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ముగిసేలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సీఐటీయూ, జీపీ కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) సీనియర్‌నాయకులు గూడూరు అంజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల నిత్యం కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. పిల్లలకు సరియైన పౌష్టికాహారం అందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు నూతన లేబర్ కోడెలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ ఎంప్లాయిస్, అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైల గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వినోద్ కుమార్, మహేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, సభ్యులు వంగూరి రాములు వెంకటయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు , సీపీఐ(ఎం) పాచరేలే పగిల లింగారెడ్డి, మంచాల మధు, అందేలా జ్యోతి, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.