Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
అర్హులైన గీత కార్మికులందరికీ సభ్యత్వం ఇవ్వాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి మడ్డి అంజిబాబుగౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని ఏపూర్ గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా తాటిచెట్లు ఎక్కుతున్న దాదాపు 200 మంది గీత కార్మికులకు ఆ సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్సై కుమారస్వామి తాటిటాకింగ్ టెస్ట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిచెట్లు ఎక్కుతున్న గీత కార్మికులందరికీ సభ్యత్వం గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండా లన్నారు.ఈ కార్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమపథకాలు వర్తిస్తా యని తెలిపారు.50 ఏండ్లు నిండిన ప్రతిగీత కార్మికునికి వృద్ధాప్య పింఛన్ వస్తుందన్నారు.ప్రమాదశావత్తు తాటి చెట్టుపై నుండి పడి గాయపడిన మృతి చెందిన సభ్యత్వాలు ఉంటేనే సంక్షేమపథకాలు అందుతాయన్నారు.ఎక్సైజ్ ఎస్సై కుమారస్వామి మాట్లాడుతూ గీతవృత్తి చాలా ప్రమాదకరమైన దన్నారు.జాగ్రత్తతో తాటిచెట్లు ఎక్కాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ జమీందర్, నజీర్, నర్మద, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నోముల వెంకన్న, గ్రామ సొసైటీ అధ్యక్షుడు బుడిగ లింగయ్య, కల్లు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.