Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
పట్టణంలోని అరిబండిభవన్‌లో మంగళవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ మాట్లాడారు.ప్రతిఏడాది ఫిబ్రవరి 21న రాష్ట్రంలోని ప్రతి సీపీఐ(ఎం) శాఖలో రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నేరేడుచర్ల పట్టణకమిటీ ఆధ్వర్యంలో 'భారత విప్లవపోరాటం భగత్‌సింగ్' పుస్తకాన్ని చదివామన్నారు.స్వాతంత్య్ర పోరా టంలో భగత్‌సింగ్ చేసిన పోరాటం, ఆయన విప్లవస్పూర్తి, పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిని స్తుందన్నారు.ఆయన తన 23వ ఏటా బ్రిటీష్ 1931 మార్చి 23న ఉరితీయడం జరిగిందన్నారు. నేటి ప్రస్తుత రాజకీయాల్లో ఆయన విప్లవస్ఫూర్తిని దేశప్రజలకు తెలియ జేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, సట్టు శ్రీను, పాతూరి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ వెంకన్న, బొల్లెపల్లి శ్రీను, సట్టు కోటయ్య, గుర్రం ఏసు తదితరులు పాల్గొన్నారు.