Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
సూర్యాపేట మండలపరిధిలోని బాలెంల రైతు వేదికలో ఆయిల్‌ఫాం సాగుపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహిొచారు.జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావునాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీధర్ రైతులకు ఆయిల్ఫామ్ తోటలు వేసు కోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ నమ్మకమైన నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ఫామ్పై దృష్టి సారించాల్సిందిగా కోరారు. జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, మంచి సారవంతమైన ఎర్ర, ఇసుక నేలలు ఉన్నాయన్నారు.. ఆయిల్ పామ్ పంట ఒకసారి వేసుకుంటే 25 నుంచి 30 ఏళ్ల పాటు ప్రతి నెల దిగుబడిని ఇచ్చేటువంటి పంంట, నమ్మకమైన బై బ్యాక్ ఉన్నటువంటి పంట, ఎకరానికి 57 చెట్లు నాటు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ జానిమియా, ఉద్యాన అధికారి కన్న జగన్, ఆరెగూడెం సర్పంచ్ స్వాతి రాఘవరెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ వెన్న దేవేందర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి అయేషా, రైతులు పాల్గొన్నారు.