Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
దేశంలో పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భగత్సింగ్స్ఫూర్తితో పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలోని అమరవీరుల స్మారక భవనంలో రెడ్ బుక్ డే సందర్భంగా 'భారత విప్లవ కెరటం భగత్ సింగ్'అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లా డారు.దేశ స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్ చేసిన పోరాట త్యాగం నేటి యువతకు ఆదర్శమన్నారు.నేటి పాలకులు కార్మిక,కర్షక, కూలీలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారన్నారు.మతోన్మాదంతో భాష, వేషంపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్‌రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు,మండల కార్యదర్శులు పోషణబోయిన హుస్సేన్, సుందర మౌలేశ్వర్రెడ్డి, తుమ్మ కొమ్మయోనా, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, మాజీ సర్పంచ్ చింతకుంట్ల వీరయ్య,మీగడ రాములు,మండల కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, వీరమల్లు, ఎలకసోమయ్య, పాశం వెంకట్ నారాయణ, పాశంవీరబాబు,శీలం వెంకన్న, సాంబయ్కయ, సైదులు, మాధవరావు, ఆవుల సైదులు, మడూరి నర్సింహాచారి, షేక్‌అహ్మద్, నెట్టెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.