Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట ఆరోగ్య జిల్లాగా మారిందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.మంగళవారం స్థానిక గండూరి జానకమ్మ ఉచిత వాటర్ ప్లాంట్ వద్ద నిర్వహించిన ఉచిత కెఎస్ వై ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. మంత్రి క్ర్రషితో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ ఆస్పత్రి, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య చికిత్సల కోసం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి వస్తున్నారని పేర్కొన్నారు.మంత్రి పేద ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో వైద్యులు, సిబ్బంది రోగులకు చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజల కోసం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఆయుష్మాన్ భారత్ -ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.ప్రజా పంపిణీ కార్డు, ఆధార్ కార్డు కలిగిన పట్టణ ప్రజలు ఆపరేటర్ ల సహాయంతో ఉచితంగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూకల వెంకట్రెడ్డి, సయ్యద్ సలీం, అడ్వకేట్ గుడిపూడి వెంకటేశ్వర రావు,చంద్రశేఖర్రెడ్డి, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, బజ్జూరి శ్రీనివాస్, బెజగం ఫణి, వుల్లి రామాచారి, ఇస్మాయిల్, ఆరోగ్యమిత్ర రమణ, డేటా ఎంట్రీి ఆపరేటర్లు జగదీశ్, సీఎస్సీ భూతరాజు మధు, ప్రతాప్, కుక్కడపు సాలయ్య, భిక్షం,సందీప్, కల్యాణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.