Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుదిబండగా మారిన వారబందీవిధానం
- కన్నీరుమున్నీరవుతున్న చివరి ఆయకట్టు రైతులు
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని నాగార్జునసాగర్ 10నెంబర్ కెనాల్, చివరి ఆయకట్టు పంట పొలాలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి.నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరున్నా పొలాలు ఎండుతున్నాయని రైతులు కన్నీరు మున్నీరవు తున్నారు.నీటి వృథాను అరికట్టడంలో భాగంగా అధికారులు తీసుకున్న వారబందీ నిర్ణయం తమ పాలిట శాపంలా మారిందని వాపోతున్నారు.తీరా నోటి కాడికి వచ్చిన వరిపొలాలు నీరందక ఎండిపోతున్నాయి.చెర్వుతండా, జాన్‌పహాడ్, శూన్యపహాడ్, దేవ్లాతండా తదితర గ్రామాలకు నీటిఎద్దడి ఏర్పడిందని, దీన్ని అధికారులు నివారించాలని కోరుతున్నారు. వాతా వరణంలో ఎండలు పెరగడంతో వారబందీకి వెసులుబాటు ఇచ్చి, ప్రభుత్వం తమ పొలాలను కాపాడాలని కోరుతున్నారు.ఎన్నెస్పీ అధికారులు క్షేత్ర స్థాయిలో తమ పొలాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.మేజర్ కెనాల్ నుండి చివరి భూములకు నీటిని నడిపించడంలో సంబంధిత అధి కారులు అలసత్వం వహిస్తున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా నీటి ప్రవా హాన్ని పెంచి, వారబందీని తీసివేసి తమ పంట పొలాలని కాపాడాలని కోరుతున్నారు.