Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లా కోర్టులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి ,న్యాయ సాధికారిత సేవా సంస్ధ చైర్మెన్ గౌతమ్ ప్రసాద్ ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవన్నారు. కోర్టులో పనిచేసే న్యాయవాదులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కంటిపరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవ సంస్ధకు, డీఎంహెచ్ఓ కోటాచలంకు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.డీఎంహెచ్ఓ కోటాచలం మాట్లాడుతూ నిత్యం పనివత్తిడిలో వుండే న్యాయవాదుల కోసం జిల్లా కోర్టులో కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.ఇప్పటి వరకు జిల్లాలో 1,35,000ల మందికి కంటి పరిక్షలు నిర్వహించగా 31 వేల మందికి దగ్గర చూపు కంటి అద్దాలు ఇచ్చారన్నారు.15000ల మందికి దూరపు చూపు కళ్ల జోళ్లకు గాను 1674 మందికి అందజేసినట్లు చెప్పారు. 85 వేల మంది ప్రజలకు ఎటువంటి చూపువ దోషం లేదన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్ధ సెక్రెటరీ శ్రావణి, ఏడీఎం ప్రశాంతి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోండ్రాల అశోక్, సెక్రెటరీ సోమేశ్వర్, సీనియర్ న్యాయవాది వసంత సత్యనారాయణ పిళ్లై, శశిధర్, డాక్టర్ హరిప్రసాద్, సూపర్ వైజర్ జానకమ్మ, ఏఎన్ ఎన్ లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.