Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశాన్ని కాపాడడం తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఈ సైనికులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక క్యాంప్ ఆఫీస్ దగ్గర గల మార్కెట్ యార్డ్ నందు సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగం పొందిన ఉమ్మడి జిల్లాకు చెందిన 43 మంది అగ్ని వీర్ సోల్జర్లకు వారి తల్లిదండ్రులకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన 225 మంది యువకులలో ఉమ్మడి జిల్లాకు చెందిన 43 మంది ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి అన్నారు.మన ప్రాంతం నుండి దేశ సరిహద్దులలో పహారా కాస్తు విదేశీ శక్తుల నుండి మన దేశాన్ని కాపాడడానికి ఈ అగ్ని వీరులు రాబోయే తరంలో చాలామంది యువతి యువకులకు మార్గదర్శకులు అవుతారని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజులలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తన పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.సూర్యాపేట చెందిన కల్నల్ సంతోష్ బాబు అమరుడై యువతకు ఆదర్శంగా నిలిచాడని మంత్రి కొనియాడారు. కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తితో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆర్మీ ర్యాలీని సూర్యాపేటలో నిర్వహించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు . సూర్యాపేటలో జరిగిన ఆర్మీ ర్యాలీ విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి , ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కర్నూల్ సంతోష్ బాబు ఆశయాలతో యువత ముందుకు సాగాలని వారు కోరారు. ఉమ్మడి జిల్లా నుండి అగ్నివీర్ సోల్జర్లుగా వెళుతున్న 43 మంది సోల్జర్లను వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యువతను ప్రోత్సహించడానికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసిన మంత్రికి ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్,కన్నల్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ సుమన్,రాజేష్, కన్నల్ సంతోష్‌బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సైనికులు, డీఆర్ఓ రాజేంద్రకుమార్, డీఎస్పీ నాగభూషణం,ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.