Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ బాడీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జులకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్చి ఒకటి, రెండు, మూడు తేదీలలో మిర్యాలగూడలో జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలలో జయప్రదం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో నియోజక వర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చ్ ఒకటో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.అంతకుముందు హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రవీంద్ర భారతి వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు.మధ్యాహ్నం రెండు గంటలకు రవీంద్ర భారతి గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందని, దీనికి మాజీ ఎంపీ ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బందాకరత్, మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మీడియం బాబురావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీరామ్‌నాయక్‌తో పాటు జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.మార్చి 2 3 తేదీలలో ప్రతినిధుల మహాసభ ఏఆర్సీ ఫంక్షన్హాల్లో జరుగుతుందని, దీనికి రాష్ట్ర నలు మూలాల నుండి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, ఆహ్వాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డబ్బికార్మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముడావత్ రవినాయక్, జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, సత్యనారాయణరావు, పరుశరాములు, గాదె పద్మ, తిరుపతి రామ్మూర్తి, ఆయూబ్, రొంది శ్రీనివాస్, రామారావు, అరుణ, యేసు, ఊర్మిల, కరిమున్నిసా, బాబు నాయక్, సైదానాయక్, జగన్నాయక్ పిల్లుట్ల సైదులు, రమేశ్, వెంకట్‌రెడ్డి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.