Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
- నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించలేని అ సమర్థ ఎమ్మెల్యే
- దివాలా కోరు రాజకీయాలు
- రాయగిరి గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు కబ్జా
- భువనగిరి కి జీమ్మదారుగా నేను ఉంటా
- డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
భువనగిరి నియోజకవర్గం లో ప్రభుత్వ పనులను బినామీ పేర్లతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాణ్యత లేని కాంట్రాక్టు పనులు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు.. మంగళవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. బినామీ టెండర్లు కాంట్రాక్టులతో భువనగిరి ని నాశనం చేస్తున్నాడన్నారు. నాసిరకం పనులు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో 95శాతం పూర్తయిన బునాదిగాని కాల్వను ఐదు రోజులు కాల్వ వద్ద ఉంది ఫోజులు ఇచ్చిన ఫైళ్ల శేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో పంటలకు సాగునీటి ని అందించడంలో విఫలం చెందారని అన్నారు. భువనగిరి నియోజకవర్గ వర్గ ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను వాటి అంశాలు అటకనెక్కించి టెంకాయలు కొడుతూ కాలం గడుపుతున్నాడన్నారు. భువనగిరి బైపాస్ రోడ్డులో అండర్ పాస్ రోడ్లు లేక ప్రజల ప్రాణాలు పోతుంటే అయన జాడలేడన్నారు. మతుల కుంటుబలను పరామర్శించాలన్నా సోయి లేదన్నారు. త్రిబుల్ ఆర్, బస్వాపురం ప్రాజెక్టులో భూ నిర్వాసితుల గుండెలు అగుతుంటే ఎమ్మెల్యే పత్తాలేడని దుయ్యబట్టారు. పట్టణంలో ని ఖీల్లా పైకి రోప్ వే వేస్తానని టూరిజం చేస్తానన్న ఎమ్మెల్యే హామీ ఏమైందన్నారు. భువనగిరి పెద్ద చెరువు నుండి ఎస్ఎల్ఎన్ఎస్ వరకు, బ్రహ్మంగారి గుడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంట్రాక్టర్ పని ఎక్కువకు తన బినామీ పెరు మీద బిటీ రోడ్డు పనులు తెచ్చుకున్నారని విమర్శించారు. చిన్న నీటిపారుదల పనులు బునాధిగాని, పిల్లయిపల్లి,ధర్మారెడ్డి కాల్వ లు ఎప్పటికి పూర్తి చేస్తరని ప్రశ్నించారు. గతంలో ప్రజల మనిషులు రావినారయణరెడ్డి, కోండ లక్ష్మణ్ బాపూజీ, మాధవరెడ్డి, ఎన్నికై భువనగిరి చరిత్రను నిలబెట్టరన్నారు. రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రజలకు అండగాలేని దగుల్బచి రాజకీయం చేయొద్దని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. జనంలో తెల్చకుందామన్నారు. భువనగిరి పట్టణంలో రెండేళ్ల కిందట దీపావళి పండుగ ఉందని మూడు రోజుల రోడ్డు వైడింగ్ పను5 నిలిపివేయాలని పట్టణ, గ్రామల ప్రజలు, వ్యాపారులు బతిమిలాడిన నియంతల వ్యవహరిచిన ఎమ్మెల్యేకు ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్తారన్నారు. ఈ మధ్యన పీకే, బొకే సర్వేల పేరుతో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ లు ఆడుతున్నారని తన విషయంలో ఆడొద్దని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయం చేయడానికి తాను పార్టీ మరుతున్నానని చౌకబారు రాజకీయలు మానుకోవాలన్నారు. వ్యక్తి నిజాయితీని శంకించవద్దన్నారు. సొంత పార్టీ ఎంపికీ మోసం చేసీన వెన్నుపోటు పోడిచిన చరిత్ర పైళ్ల శేఖర్ రెడ్డి దని త్రీవంగా విమర్శించారు . రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గంలో సత్తా చాటుతుందన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సంవత్సరాల్ని గుర్తు చేశారు. భువనగిరి నియోజకవర్గ పట్టణానికి జిమేదారిగా ఉంటానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, పిసిసి సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, కోట పెద్ద స్వామి, మాదాసు గోవర్ధన్, అందే నరేశ్ పాల్గొన్నారు.