Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
భువనగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా చేస్తున్న రోడ్డు పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, పీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ మాట్లాడుతూ 17 రోజులుగా పనులు నత్తనడకన జరుగుతున్నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మెన్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ బెండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సల్లావుద్దీన్ . కైరం కొండ వెంకటేష్. నాయకులు కోళ్ల కృష్ణ. సాల్వేరు ఉపేందర్, బాలకృష్ణ, కుసుమ రవి, పూమార్ శ్రీనివాస్. లాలి. అశోక్, రత్న రాజశేఖర్, గాజుల కుమార్ పాల్గొన్నారు.