Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
మార్చి 15 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. గురువారం కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ తో ఆయన సమావేశమై రాబోయే ఇంటర్ పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సి చర్యలపై సమీక్షిస్తూ, గత 2022 విద్యా సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం హాజరు శాతం చాలా పెరిగిందని అన్నారు. పరీక్షలకు కొద్దికాలం ఉన్నందున కాలేజీలలో స్టడీ అవర్స్ పెంచాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పరీక్షలకు సన్నద్దం చేయాలని, ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత పొందేలా బోధన జరపాలని ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీలలో కూడా బుధవారం బోధన కార్యక్రమాలు అమలు చేయాలని, విద్యార్థులలో అభ్యసనా సామర్థ్యం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరిగేలా బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని, వృత్తివిద్యా కోర్సులలో విద్యార్థుల గణనీయమైన నైపుణ్యాన్ని వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.