Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రం, పరిధిలోని గ్రామాలలో రైతులు విత్తిన వరిచేలలో జింక్ లోపం,అగ్గి తెగులు, మైక్రో న్యూట్రియన్ సూక్ష్మ పోషకాల లోపం, ఎక్కువగా కనబడుతుందని మండల వ్యవసాయ అధికారిని పద్మజ తెలిపారు. గురువారం విలేకర్లతో మాట్లాడుతూ మిశ్రమ వాతావరణం ఉండడంతోపాటు ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా వరి చేలలో సూక్ష్మ పోషక లోపం ఏర్పడిందన్నారు. దీనితోడు చలి తీవ్రత ఎక్కువైందని తెలిపారు.దీని నివారణకు రైతులు జింకు లోపానికి, జింక్ సల్ఫేట్, సూక్ష్మ పోషకాల మల్లికే , పౌడర్ లిక్విడ్ రూపాయలలో లభిస్తుందన్నారు. ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున వాడాలన్నారు 14035 సైతం వాడవచ్చు అన్నారు. అక్కడక్కడ వరి చేలలో అగ్గి తెగులు సైతం సోకిందని, త్రి సాక్ష్యజోల్ వాడాలని, ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున, చూడ మోనార్క్స్ జీవన ఎరువులు 10 గ్రాములకు ఒక లీటర్ నీళ్లతో, లిక్విడ్ సైతం అదే మోతాదులో రైతులు వాడాలని తెలియజేశారు. పంట దిగుబడికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తనతోపాటు, ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. సలహాలు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.