Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గణేశ్నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ కేంద్ర బీజేపీప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, మతోన్మాద రాజకీయాలకు మానుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలకు బీజేపీ పాల్పడుతుందన్నారు. గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. బడ్జెట్లో జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీబీనగర్ లో ఏర్పాటుచేసిన ఎయిమ్స్ పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందన్నారు.జిల్లా ప్రజలను అనేక అనారోగ్యాలు గురిచేస్తున్న మూసి కాలుష్యం నుండి కాపాడేందుకు ప్రక్షాళనకు నిధులు కేటాయించకుండా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సానీకట మండల కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు వెంకటేశం,కల్కూరి రామచందర్,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి,పార్టీ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,తుర్కపల్లి ఉప సర్పంచ్ వెల్మకన్నె బాలరాజు,నాయకులు దొడ్డి బిక్షపతి,దండెం నర్సిరెడ్డి,ప్రజా సంఘాల మండల నాయకులు వేముల నాగరాజు రుద్రపళ్లి రామలింగం చేగురి నగేష్,గాజుల వెంకటేశం,వేముల జ్యోతిబసు,కొమ్మిడి రఘునాథ్ రెడ్డి,వేముల విష్ణు,ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు .
రామన్నపేట : దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్న బిజేపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో గురువారం సుభాష్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పేరుతో ప్రజలమద్య వైశమ్యాలు సష్టించి దేశాన్ని అదోగతిపాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. త్రిపుర రాష్ట్రంలో అధికార దాహంతో సీపీఐ(ఎం) కార్యాలయాలపై, నాయకులపై దాడులు చేశారన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, ఉపాదిహామికి నిధులు తగ్గించి వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్ర పండుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు బల్గూరి అంజయ్య, వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, బావండ్లపల్లి బాలరాజు, కందుల హనుమంతు, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి సత్యం, అప్పం సురేందర్, దేవరపల్లి భిక్షంరెడ్డి, ఎర్ర కాటమయ్య, శానగొండ వెంకటేశ్వర్లు, మేడి భాషయ్య, పాల్వంచ ప్రతాప్, గాదె పరమేష్, జంగిలి కుమార్, సంగిశేట్టి శివాజి, పుట్టల ఉదరు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : కేంద్ర ప్రభుత్వ మతోన్మాద రాజకీయ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ మాట్లాడారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ కిష్టయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్. పార్టీ మండల కార్యవర్గ సభ్యులు సుధ గాని సత్య రాజయ్య, నల్ల మాస తులసయ్య ,మాజీ మండల కార్యదర్శి మొరిగాడి రమేష్ ,నాయకులు బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, ఘనగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..
బొమ్మలరామరం: ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రకటించాలని,కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుతూ పేదలపై నా భారాలు మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, రంగాపురం లక్ష్మయ్య ,యాదయ్య, ముక్కెరపున్నమ్మ రాములు నరసమ్మ కేసారం యాదయ్య ,నాగరాజు ,మహేష్ ,మోక్షపతి ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.