Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
ఇటుక బట్టీలలో పనిచేస్తున్న బట్టి కార్మికుల పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలను సందర్శించారు. భట్టిల్లో కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది చిన్నపిల్లలు బట్టీల్లో ఉన్నారన్నారు. తాత్కాలిక చదువుల కోసం చిన్నచిన్న గదులలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్నారన్నారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకొని చేస్తున్న కార్మికుల పిల్లలకు బట్టీల వద్దనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి పౌష్టిహాహారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను కూడా బట్టీల వద్ద ప్రారంభించి పిల్లలకు చదువు నేర్పించాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలను ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోటా రామచంద్రారెడ్డి ,మంచాల మధు ,తదితరులు పాల్గొన్నారు.