Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
65 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక సంఘం కల్లు గీత కార్మిక సంఘమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను గురువారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. సంఘాన్ని 1957 సంవత్సరంలో ధర్మబిక్షం ఏర్పాటు నేటికీ 65 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సంఘం అంటే ఏకైక సంఘం తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అన్నారు. సూర్యాపేట జిల్లాలో 500 దిమ్మలు ఏర్పాటు చేస్తామని, అన్ని గ్రామాలలో గీత కార్మికుల పోరాటాల గుర్తుగా దిమ్మెలు సంఘాలను బలంగా నడిపించడానికి ఏర్పాటు చేయాలని తెలిపారు. సంఘంలోకి యువత మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెలుగూరు గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, సీనియర్ నాయకులు భిక్షం, జిల్లా నాయకులు నాగేష్, జనార్ధన్, అన్నపూర్ణ, కృష్ణ, మల్లయ్య, రమేష్, సైదులు, కాశయ్య, వెంకన్న, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.