Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ పరిశీలకులు ఆర్.మంగారెడ్డి
నవతెలంగాణ- కోదాడరూరల్
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి పదవ తరగతి ఫలితాల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన , శిక్షణ సంస్థ పరిశీలకులు ఆర్.మంగా రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక కట్ట సాయి భవాని గర్ల్స్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పదవ తరగతిలో గతంలో 11 పేపర్లు ఉండేవని వాటికి బదులుగా ఆరు పేపర్లు, అయిన సందర్భంగా ఉపాధ్యాయులు,విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరూ ప్రణాళిక బద్ధంగా సిద్ధం కావాలని సమయాన్ని వృధా చేయవద్దు అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులను పరీక్షల సమయంలో కూడా కొనసాగించాలన్నారు. పాఠశాలలో జరిగే సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యాలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ టి సైదిరెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ రామారావు, గెజిటెడ్ హెడ్ మాస్టర్ యన్ జి శివకుమారి, డి ఆర్ పి చారు గండ్ల రాజశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.