Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆత్మకూరుఎస్
24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా కోతలు విధించి ,వ్యవసాయ ఆటోమెటిక్ స్టార్ట్లను తొలగించి పంటలను పాడు చేస్తుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లు ప్రధాన రహదారిపైఅఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేళాపాలలేని విద్యుత్ కోత కారణంగా వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఉండలేక విద్యుత్ మోటార్లకు ఆటోమేటిక్ స్టార్టర్లు బిగించుకొని కొద్ది పాటి పంటల సాగు చేసుకుంటుండగా స్టాటర్లు తొలగించే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడం విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఇప్పటికే ఎండిపోతున్నాయన్నారు. 24గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం), బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాయకులు అవిరే అప్పయ్య,వేల్పుల వెంకన్న,శ్రీనివాస్ రెడ్డి,దామోదర్ రెడ్డి, బీజేపీ నాయకులు దండా వెంకట్ రెడ్డి బెల్లం కొండ పర్వతాలు, సుందరయ్య, కాంగ్రెస్ నాయకులు దండ అరవింద్ రెడ్డి,బీరెల్లి వెంకట్ రెడ్డి,పేరం లక్ష్మి నర్సు రైతులు సంజీవ రెడ్డి,గుండాల విష్ణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.