Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ- ఆత్మకూరుఎస్
వ్యవసాయానికి ప్రభుత్వం 9గంటల విద్యుత్‌ను కూడా ఇవ్వడంలేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.మహాపాదయాత్రలో భాగంగా గురువారం 15 రోజు మండల పరిధిలోని బొప్పారం ఏపూరు, ఏపూర్ తండ బోడ తండా, అచ్యతండా లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయం కు ఇస్తామన్న ప్రభుత్వం కనీసం 9గంటలు కూడా ఇవ్వలేక పోతుందని విమర్శించారు. జగదీశ్ రెడ్డి మంత్రిగా అధికారంలోకి వచ్చాక రాజకీయంగా ప్రజాబలం ఉన్న నాయకులను తొక్కుకుంటూ వచ్చాడని విమర్శించారు. గ్రామాల్లో ప్రశ్నించే గొంతుక లేకుండా అనచివేసి ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నాడన్నారు. . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు వారికి మద్దతు ధర, ఏడాది కి కుటుంబానికి 15 వేల రూపాయలు, 5లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని 500 కే గ్యాస్ ఇస్తామన్నారు. బోడ తండాలో గిరిజన మహిళలతో బంజారా నృత్యం చేసి గిరిజనులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సిఎచ్ గోపాల్ రెడ్డి,నామ ప్రవీణ్, వెలుగు వెంకన్న,స్వామి నాయుడు,దేవేందర్ పానుగంటి మల్లారెడ్డి, అరవింద్ రెడ్డి, భోజ్య నాయక్ ,రాములు నాయక్, వెంకన్న నాయక్, హేమ నాయక్, తదితరులు పాల్గొన్నారు.