Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని శ్రీరంగాపురంలో గల అభయాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భక్త జన సమూహంలో కనుల పండువగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొని మాట్లాడుతూ ఆంజనేయస్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గత 20 ఏళ్లుగా వైభవంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్న కమిటీ వారిని అభినందించారు. ఆలయ అభివద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాంతి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కందుల కోటేశ్వరరావు, వంకా నాగేశ్వరరావు, చిత్తలూరి ముత్తయ్య, కందుల వెంకట నరసయ్య, వనపర్తి భద్రయ్య, పోలిశెట్టి రాము, గ్రామ పురోహితులు జొన్న బట్ల వెంకట నాగేంద్ర శాస్త్రి, దేవాలయ అర్చకులు శ్రీమాన్, ఉండ్రుగొండ శ్రీనివాసాచార్యులు, ప్రవీణ్ ఆచార్యులు, స్థానికులు భక్తులు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.