Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ
నవ తెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో ఉన్న ప్రయివేటు పాఠశాల యాజమా న్యాల అక్రమాలను కప్పిపుచ్చుతూ యాజమా న్యాలకు డీఈవో కొమ్ముకాస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ విమర్శించారు. గురువారం స్థానిక విఎన్ భవన్ లో జరిగిన ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడిపిస్తున్నారని, వేలాది రూపాయల అక్రమంగా దండుకుంటున్నారని పేర్కొన్నారు. అనుమతులు లేని భవనాలు, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న విద్యాశాఖ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. యాజమాన్యాలు ఇచ్చే డబ్బుల ముడుపులను తీసుకుంటూ వారి అక్రమాలకు అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. పలు పాఠశాలల యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారికి సాక్షాలతో సహా వినతి పత్రాలు అందజేసిన విచారించి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. డీఈవో కార్యాలయ అవినీతి అక్రమాలపై విద్యాశాఖ మంత్రికి ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే వందలాది మంది విద్యార్థులతో డీఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, అభి, వినరు, అరుణ్ గోపి తదితరులు పాల్గొన్నారు.