Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణ పరిధిలోని కోమరబండ కేఎల్ఆర్లోని తేజ విద్యాలయ పాఠశాలలో ప్రముఖ భారతీయ కెనడియన్ శాస్త్రవేత్త పుట్టగుంట వేణుగోపాలరావుతో తేజ విద్యాలయ పిల్లలు ముఖాముఖిలో గురువారం పాల్గొన్నారు. చదువులు పిల్లల గమ్యం అనే అంశం ఆధారంగా తేజ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థిది ఒక ధ్యేయం ఏర్పరచుకుని శ్రద్దతో చదువు కొనసాగిస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చని వివరించారు. ప్రతి విద్యార్ది లోను అపరిమితమైన పరిజ్ఞానం దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజ విద్యాలయ ఛైర్మన్ రమాసోమిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మంత్రిప్రగడ వేణుగోపాలరావు, అకడమిక్ ఇన్చార్జ్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.