Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
నేడు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంఅనుసరిస్తున్న కార్మిక, కర్షక, కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 15 నుండి 31వ తేదీ వరకు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే మోటర్ బైక్ ర్యాలీని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడంతో చట్టాలను వెనక్కి తీసుకుందని నేడు ప్రవేశపెట్టాలని చూస్తుందన్నారు. స్వామినాథన్ కమిషన్ ఏర్పాటుతో నేడు బడ్జెట్లో ఉపాధి హామీ పనులకు ఎటువంటి నిధులను కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ పనులు రైతులకు కూలీలకు నష్టం వాటిల్లిందన్నారు. దేశంలో ఆధునిక పనులు దొనకపోవడం పనులు లభించక కేటాయించకపోవడం పూర్తిగా కూలీలకు పనుల దొరక్కుండా ఆర్థిక ఇబ్బందులకు లోన్ అవుతున్నారన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు నిధులను కేటాయించి రోజువారి పనులను కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మల్లు లక్ష్మి కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పార్టీ జిల్లా నాయకులు పులుసు సత్యం , మండల కార్యదర్శి వజ్ర శ్రీనివాస్, నిమ్మన గూటి అబ్బులు, మాజీ ఎంపిటిసి కొప్పోజ్ సరోజ యాదగిరి, జమ్మలగుంట్ల కృష్ణయ్య ,బొడ్డు సైదులు,కనుక నరసయ్య పాల్గొన్నారు.