Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీయూ ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
తొలి దశలో నైపుణ్యాలను పెంపొందించుకుంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ప్లేస్మెంట్ సెల్, టీఏఎస్కే, పీజీకే టెక్నాలజీస్ సీ2 హెయిర్ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కంపెనీలతో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తొలి దశలోనే నైపుణ్యాలను పెంపొందించుకొని క్యాంపస్‌లో జరుగుతున్న ప్లేస్మెంట్ డ్రైవ్స్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసుపాటి రమేష్, సీఈఓ పీజీకే టెక్నాలజీస్ సిటు హెయిర్ సుధీర్, మేనేజర్ సందీప్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి పాల్గొన్నారు. 250 మంది విద్యార్థులు హాజరుకాగా 105 మందికి ఉద్యోగ అవకాశం లభించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.