Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రజా ఉద్యమ పోరాటాలలో కమ్యూనిస్టులదే అగ్రస్థానమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలో కొట్టం యాదయ్య అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల కోసం కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టులు ఎనలేని పోరాటాలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు చట్టాలుగా కుదించి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 26, 27 తేదీలలో మండల కేంద్రాలలో నిసర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మార్చి 1, 2, 3 తేదీలలో మిర్యాలగూడ పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర గిరిజన మహాసభలకు మండలం నుండి గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, ఉప్పునూతల వెంకటయ్య, పెరుమాండ్ల మంజుల, తదితరులు పాల్గొన్నారు.