Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబందు ఆస్తుల పంపిణీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
అన్ని వర్గాల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 75 మంది లబ్దిదారులకు 10 లక్షల చొప్పున 7 కోట్ల 50 లక్షల రూపాయల ఆస్తులను (ట్రాక్టర్, జేసీబీ, 4 వీలర్ ట్రాన్స్పోర్ట్) వాహనాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేపట్టని అనేక పథకాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. నిరంతరం పేద ప్రజల అభివద్ధి కోసం కేసీఆర్ శ్రమిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. అలాంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, నందిని రవితేజ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.