Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ-నకిరేకల్
మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న కోతుల బెడదను నివారించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అమరవీరుల స్మారక భవనంలో ఆ పార్టీ మండల కమిటీ సమావేశం మర్రి వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోతుల బెడదతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వరి పొలాలు, పండ్ల తోటలు, కూరగాయ తోటలు కోతుల తీవ్ర నష్టం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు కృష్ణా జలాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి రాచకొండ వెంకన్న, పుట్ట సత్తయ్య, లగిశెట్టి శ్రీనివాస్, ఏర్కలి అంజయ్య, అక్కెనపల్లి సైదులు, ఆదిరాల దుర్గారావు, మర్రి బక్కయ్య, కోటిలింగం, జిల్లా ఉపేందర్ పాల్గొన్నారు.