Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను అడ్డుకోవద్దు
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో మండలంలోని గొట్టిముక్కల రిజర్వాయర్లు ముంపుకు గురైన రైతులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడారు. పరిహారం అందించేందుకు భూ సేకరణ చట్టంకు లోబడి పరిహారం అందిస్తామని రైతులకు సూచించారు. రిజర్వాయర్ పనులను అడ్డుకోవద్దని రైతులు సహకరించాలని కోరారు. ధరణిలో పొరపాటు భూములను సరిచేసి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. చింతపల్లి మండలం సమీపంలో ఆర్ అండ్ ఆర్ క్రింద రైతులు ఇండ్ల స్థలాలు పొందిన వారు ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పిస్తామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పొందిన లబ్ధిదారులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి, వారికి పరిహారం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పనులకు రైతులంతా సహకరించాలని కలెక్టర్ సూచించారు. వారంలో ప్రతి బుధవారం ముంపు రైతులతో సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓ లీల, సీఐ శ్రీనివాసు, గొట్టుముక్కుల సర్పంచ్ కడారి అయ్యన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.