Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని ప్రజలపై దాడి చేసి గాయపర్చుతున్న కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎమ్‌డి.బాబాషరీఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జీ కమిషనర్ భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వార్డుల్లో కుక్కలు గుంపులుగుంపులుగా ఉండి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపర్చుతున్నాయని తెలిపారు. తక్షణమే కుక్కలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఆలె నాగరాజు, సుల్తాన్ రాజు, బీఆర్ఎస్ నాయకులు బొడిగె బాలకృష్ణగౌడ్ ఉన్నారు.
కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని వినతి
స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న వీధి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అన్ని గ్రామాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. పసిపిల్లలను ఆడుకోవడానికి ఇంటి నుండి బయటకు పంపించలేని భయానక పరిస్థితి ఏర్పడిందన్నారు. పెద్దవారు సైతం రాత్రి వేళల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు బోయ కుమార్, పి.నవీన్ ఉన్నారు.