Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత ప్రవేశపెట్టిన కంటి వెలుగు ప్రోగ్రాం ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటి వెలుగు సూపర్వైజర్ యాకయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రహదారి బంగ్లా వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం 61 మంది కంటి వెలుగు సేవలు పొందగా , 26 మంది పురుషులకి , 35 మంది స్త్రీలకి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కిష్టయ్య , కంటి వెలుగు డాక్టర్లు ఝాన్సీ, మనీషా,ఉమా, సూపర్వైజర్ కిష్టయ్య, ఆరోగ్య సిబ్బంది స్వరాజ్యలక్ష్మి, నిర్మల , అనిత , ఆశా కార్యకర్తలు మాదాసు వాణి, మంజుల ,కె.లలిత, జి.విజయలక్ష్మి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.