Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
మండల పరిధిలోని శివారెడ్డి గూడెం గ్రామం నుండి దంతూర్ గ్రామానికి వెళ్లే దారిలో వాగు పైన వంతెన నిర్మాణా పనులను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి అన్నారు. శుక్రవారం శివ రెడ్డి గూడెం దంతూర్ గ్రామాల మధ్యన ఉన్న మూసీి నది బ్రిడ్డిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. వెంటనే పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి వారాల మల్లారెడ్డి మండల కమిటీ సభ్యులు కోటా రామచంద్రారెడ్డి ,మంచాల మధు, నాయకులు వెంకటేశ్, వీరారెడ్డి ,చింటూ పాల్గొన్నారు.