Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుర్కపల్లి
అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిరుమలాపురం గ్రామంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించారు. గతంలో పింఛన్ పొంది ఇప్పుడు రాకపోవడం వల్ల అర్హులైన పేదలు మనోవేదనకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అర్హులను గుర్తించి పింఛన్ మంజూరు చేయాలని లేని పక్షంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు గడ్డమీద నరసింహ, కోట నాగరాజు, రాజుపాల్గొన్నారు.