Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -బీబీనగర్
బాలల రక్షణ, వారి హక్కుల పట్ల తల్లిదండ్రులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్నేహిత రెండవ విడత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం వారి సంరక్షణ బాధ్యత పట్ల తల్లిదండ్రులకు ఆవగాహణ కల్పించేందుకు గాను గత సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో స్నేహిత మొదటి విడత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా 26 టీంలను ఏర్పాటు చేసి 17 మండలాలలో 271 పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు సుమారు 43 వేల మందికి ఆహ్వాన కల్పించడం జరిగిందని తెలిపారు, గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 42 టీముల ఏర్పాటుతో 251 ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే 17058 మంది బాలలకు ఐదు అంశాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు, మంచి స్పర్శ, చెడు స్పర్శ ,విద్యా ప్రాముఖ్యత, పరిసరాలపై అవగాహన, ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆరోగ్యకర అలవాట్లు, భౌతిక వ్యాయామం, వంటి అంశాలపై విపులంగా తెలియజేయడం జరుగుతుందని అన్నారు, ఇందుకు ప్రజాప్రతినిధులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థుల భద్రత పట్ల పోలీస్ శాఖ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు, పిల్లల హక్కులను కాపాడడంలో పోలీసు శాఖ ముందుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్ దీపక్ తీవారి మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కోసం స్నేహిత కార్యక్రమాన్ని చేపట్టి బాలల ఎదుర్కొంటున్న సమస్యలు వాటి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆవగాహణ కల్పిస్తున్నామని బాలల రక్షణ, హక్కులను సంరక్షిస్తే నే మంచి సమాజం నిర్మితమవుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ యెర్కకల సుధాకర్ గౌడ్, జడ్పిటిసి గోళి ప్రణిత పింగల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లగారు భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీవాణి, ఎం ఆర్ వో అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, కలెక్టరేట్ సూపర్డెంట్ నాగలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, ఉపసర్పంచ్ ఎండి దస్తగిరి, ఎస్ఎంసి చైర్మన్ నాగలక్ష్మి, చిన్నారులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : స్నేహిత ఫేస్ - 2 కార్యక్రమంలో భాగంగా గంజి ప్రైమరీ స్కూల్లో స్నేహిత ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీచైర్పర్సన్్ బండారు జయశ్రీ మాట్లాడుతూ కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం స్నేహిత అని అన్నారు. ఇందులో ఐదు అంశాలు ఉన్నాయని తెలిపారు. ఒకటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్.. సెల్ఫ్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్.. సెల్ ఫోన్ మాడటంలో లాభనష్టాలు.. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్... హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఈ ఐదు అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. పిల్లలు ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 1098 కి లేదా 100 కి కాల్ చేయాలని వారికి సంబంధించిన రక్షణ సంరక్షణ చర్యలు శిశు సంక్షేమ శాఖ చేపడుతుందని తెలిపారువార్డు కౌన్సిలర్ భవాని మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ అన్ని రకాల యాక్టివిటీస్ లో పిల్లలు పాలుపంచుకునేలాగా తీర్చిదిద్దుతున్న పాఠశాల టీచర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మౌన్యా రెడ,ి్డ ప్రధానోపాధ్యాయులు సంతోష్ , టీచర్ సరిత ,అంగన్వాడి సూపర్వైజర్ నర్మదా, టీచర్స్ లలిత పుష్ప పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : స్నేహిత కార్యక్రమాల ద్వారా బాలల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్,జెడ్పీటీసీ సబ్బూరు బీరు మల్లయ్య తెలిపారు. శుక్రవారం బోల్లపల్లి గ్రామంలో స్నేహిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్నేహిత కార్యక్రమాల ద్వారా బాలలపై హింస, వేధింపులు లాంటి సంఘటనలకు గురి కాకుండా, బాలలకు పౌష్టికాహార ప్రాముఖ్యత, విద్య యొక్క ప్రాముఖ్యతలపై అవగాహన కల్పిస్తూ పిల్లలు తమను తాము స్వతహాగా రక్షించుకునే మార్గాలను విడమరచి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్టులను అందజేశారు. స్నేహిత కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రవీంద్రాని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, బాలబాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో అంగన్వాడీ ఆద్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్నేహిత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు హెల్త్ న్యూట్రీషన్లు, స్కూల్ ఎడ్యుకేషన్ ,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ,పై వివరించి ,సమయం వృధా చేయకుండా టివి సెల్ పోన్ ఇంటర్నెట్ పిల్లలపై చెడు ప్రభావం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి కృష్ణ, ఎంపిడిఓ చంద్రమౌలి ,ఎంపిఓ ప్రేమలత,అంగన్వాడీ సూపర్ వైజర్ మధుర ,సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్ ,ప్రదాననోపాద్యాయులు రాణి ,నివేదిక,ఎస్ ఎం సి చైర్మన్ బండి నర్సయ్య, అంగన్వాడీ టీచర్లు మమత ,నిరీక్షణ, రాములమ్మ,పంచాయతీ కార్యదర్శి గడ్డం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : మండలంలో వీరారెడ్డిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో స్నేహిత ఫేస్-2 కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ జక్కుల శ్రీవాణి వెంకటేష్ యాదవ్ విద్యార్థులకు స్నేహిత ప్రోగ్రాంలోని అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లాలయ్య,ఉపాధ్యాయులు లత , స్వప్న , రమణి ,అంగన్వాడి సూపర్ వేజర్ విజయలక్ష్మి,విసిపిసి కమిటీ మెంబర్ ఇస్తారి,ఏఈఓ జెస్సి, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి, వర్షిత ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు,
రామన్నపేట : మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్నేహిత ఫేస్ టు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ జల్లెల లక్ష్మమ్మ పెంటయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ కే స్వాతి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడాలను, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు. అత్యవసర సమయంలో 100, 1098 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కాటంరాజు, రిసోర్స్ పర్సన్స్ నవనీత, పుష్ప, ఏ ఈ ఓ శృతి, ప్రధానోపాధ్యాయులు జి ఆనంద్, ఉపాధ్యాయులు జీ వెంకటేశ్వర్లు, రాధిక అంగన్వాడి ఉపాధ్యాయులు సత్యవతి, ప్రతిభ పాల్గొన్నారు.