Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల :రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపరిధిలోని నర్సింహులగూడెంలో శుక్రవారం రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఎంపీపీ యలక బిందు నరేందర్రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని కోరారు.వైద్యాధికారి యోల్లా శ్రీశైలం మాట్లాడుతూ కంటి సమస్యలు నివారణకు ఆకుకూరలు,పండ్లు, క్యారెట్, బొప్పాయి, చేపలు, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.సెల్ ఫోన్ వాడకం తగ్గించి టీవీలకు దూరం నుండి చూడాలన్నారు.135 మందికి పరీక్షలు నిర్వహించా మన్నారు.45 మందికి రీడింగ్ కళ్లద్దాలు పంపిణీ చేసి 27 మందిని ఆపరేషన్ కోసం గుర్తించామన్నారు, 41మందికి సిప్రోఫ్లాక్సిన్ చుక్కల మందు,ఏ,డీ విటమిన్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సర్పంచ్ కొప్పు ప్రమీల, ఉపసర్పంచ్ పులి నాగేశ్వరరా వు,ఎంపీటీసీ మదార్బీ, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, క్యాంప్ మెడికల్ ఆఫీసర్ కత్తి రవళి, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్,కంటి వెలుగు టీమ్ మేనేజర్ లింగం రామకృష్ణ, ఆప్తాల్మిక్ ఆఫీసర్ రమేష్, డీఈఓ,శైలజ.ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.