Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని కూచిపూడి గ్రామంలో లబ్దిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు.బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కులు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వయంగా ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్లో సరస్వతి విగ్రహానికి , రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీడ్రెయిన్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలంతా ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.ఎమ్మెల్యే స్వయంగా మా ఇంటికి వచ్చి చెక్కునివ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉందని లబ్ధిదారులను హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు, సర్పంచులు శెట్టి సురేష్ నాయుడు,భూక్యా సైదా నాయక్ , ఎంపీటీసీ శంకర్ శెట్టి కోటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు అబ్దుల్ , బాదావత్ బాబురావు, బీఆర్ఎస్ నాయకులు భాస్కర్, అప్పారావు, మల్లెల బ్రహ్మయ్య, రామారావు, శెట్టి శీను, తిరుపతయ్య, మాజీ సర్పంచ్ బాబురావు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ యాదవ్, క్రాంతి కుమార్, బాలకృష్ణ,అధికారులు, తదితరులు పాల్గొన్నారు