Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
- కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మనవూరు మనబడి పథకం కింద జిల్లాలో ఎంపికైన పాటశాలలో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మనవూరు..మనబడి పనుల పురోగతి పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మనవూరు మనబడి పథకం పనులలో ఎక్కడకూడా పనుల విషయంలో రాజీ పడకుండా నిబద్ధతతో పనులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆదేశించారు. జిల్లాలో మొదట విడతగా 329 పాఠశాలలు ఎంపికాగా అందులో 324 పాఠశాలలకు అనుమతులు వచ్చాయన్నారు. రూరల్ ఏరియాలో 279 అలాగే అర్బన్ ఏరియాలో 50 లలో పనులు జరుతున్నాయని తెలిపారు.46 పైలెట్,మోడల్ స్కూల్స్‌లలో ఇప్పటికే 3 ప్రారంభించుకున్నామని, మిగిలిన 43 పాఠశాలల పనులను మార్చి నెల 31 నాటికి పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇకపై పాఠశాల పనుల పరిశీలనకై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు సక్రమంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని మండలంలో పనులు పూర్తి అయిన చోట వెంటనే రంగులు వేయాలని, పాఠశాలల సుందరికరణకు ఎక్కువగా మొక్కలను పెంచాలని సూచించారు. పనులు సక్రమంగా జరగని పాఠశాల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. ఇకపై పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో 102 జీపీ భవనాలు ఉపాధి హామీ నిధులతో మంజూరైన పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు, సర్పంచులు అలాగే పంచాయతీ కార్యదర్శులు ఆదేశించారు. అనంతరం మండలాల వారిగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, పీడీ కిరణ్ కుమార్, డీఈ రమేష్, పీఆర్. ఇంజనీర్లు, ఏఈలు, ఎంఈఓ లు తదితరులు పాల్గొన్నారు.