Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
రహదారి ప్రమాదాలను నివారించడానికి అవసరమైన నివారణ చర్యలను చేపట్టామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.జిల్లాలో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ పట్ల లోతుగా ఆలోచన చేసి మెరుగైన నివారణ చర్యలు చేపట్టాలని, ఆదిశగా కార్యాచరణ చేయాలని సిబ్బందికి సూచించారు.జీఎంఆర్, జాతీయ రహదారుల సంస్థ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంగా పనిచేయాలని రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు.జాతీయ రహదారుల వెంట ప్రజలకు అవగాహన కల్పించడం,సూచికలు ఏర్పాటు చేయడం, బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇంజనీరింగ్ నిపుణులతో ప్రణాళిక చేయాలని సూచించారు.అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రజలు, వాహన దారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రహదారులపై బాధ్యతగా నడుచుకోవాలని పేర్కొన్నారు.వాహనాలను రహదారులపై ఎక్కడపడితే అక్కడ నిలపవద్దని మద్యం తాగి వాహనాలను నడపవద్దన్నారు.పశువులను రోడ్లపైకి రానివ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, సూర్యాపేట నాగభూషణం, సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మునగాల సీఐ ఆంజనేయులు, కోదాడరూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, ఎస్సైలు విష్ణుమూర్తి, సాయిరాం, లోకేష్, డీసీఆర్వీ రోడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.