Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
కేతేపల్లి మండలంలోని ఇప్పలగూడెం గ్రామ శివారులోని గోదాంలో ఈనెల 22న జరిగిన అగ్ని ప్రమాదంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, గోదాముల్లో నిల్వ ఉంచిన గన్ని బ్యాగ్స్ మాయం చేసి కావాలనే అగ్నిప్రమాదం చేసినట్లు టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి దైద రవీందర్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం కేతేపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ - ఇప్పలగూడెం నిల్వ ఉన్న గన్ని బ్యాగ్స్ కాలి పోయిన ఘటలో రాజకీయ కుట్ర ఉన్నట్టు, కొత్త బస్తాల బెల్స్ మాయం చేసి కావాలనే కొన్ని బస్తాలకు నిప్పు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుందని, రైతులకు , ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తం చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగితే స్థానిక ఎమ్మెల్యే కానీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కానీ సందర్శించకపోవటంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు మా అనుమానాల పై సునిశితంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేతేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్, కాంగ్రెస్ పార్టీ కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్‌యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మెన్ గార్లపాటి రవీందర్‌రెడ్డి, కప్పల సైదులు, యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దం విజయ్, ఎండీ. యూసుఫ్, చెనగోని రాజశేఖర్‌గౌడ్, పందిరి సతీష్ పాల్గొన్నారు.