Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సక్రు నాయక్
నవతెలంగాణ-పెద్దవూర
వరంగల్‌లో కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీసియా వైద్య విభాగం జూనియర్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతికి కారణమైన నిందితుడు మహ్మద్ సైఫ్‌ను వెంటనే ఉరితీయాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమావత్ సక్రునాయక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో గిరిజనులపై అత్యాచారం రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలు విద్యార్థినిలు ఎక్కడ తిరిగలేని స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా పోయిందని విమర్శించారు. నిదితునికి కఠిన శిక్ష విధించాలని కోరారు. లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మేరావత్ మునినాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్వరరావునాయక్, సపావత్ శ్రీనునాయక్, రవి నాయక్, దస్రు నాయక్, పాండునాయక్, నాగనాయక్, వాలానాయక్, శ్రీను నాయక్, బాబు నాయక్, జై లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.