Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల పట్టా పాస్ పుస్తకాల ముద్రించి పంపిణీ సన్నద్దం కావాలి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, యుద్ధప్రాతిపదికన పని చేసి సకాలంలో పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పుర పాలన పట్టణ అభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జీఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ టీి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్తా, భాస్కర్రావు, డీఎఫ్ఓ భాస్కర్రావు, జిల్లా ఉద్యానవనాధికారి సంగీత లక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు.