Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
చిట్యాల కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం కార్ లోన్ మేళా నిర్వహించారు. కార్ లోన్ మేళ శిబిరాన్ని కెనరా బ్యాంక్ డీఎం సాయి ప్రకాష్ ప్రారంభించి మాట్లాడారు. మేళాలో టాటా హుండారు మారుతి, కియా కంపెనీలకు చెందిన షోరూం నిర్వాహకులు వాహనాలకు ఇచ్చే రుణ వివరాలను వివరించారు. తమ బ్యాంకు ద్వారా రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే మంజూరు చేస్తామని, సరైన పత్రాలు ఉన్నట్లయితే ఖాతాదారులకు సత్వరమే రుణాలను అందజేస్తామని తెలిపారు. విద్య, వ్యాపారం, గృహ, బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీరేట్లకు కోట్లాది రూపాయల రుణాలను ఇప్పటికే మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్యాల బ్యాంక్ మేనేజర్ వేమిరెడ్డి వరుణ్ కుమార్రెడ్డి, సుష్మ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.