Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
చిట్యాల పట్టణంలో యశోద హాస్పిటల్ వారు హైదరాబాద్ విజయవాడ హైవేపై గుండ్రాంపల్లి, కట్టంగూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఉచిత అంబులెన్స్ సర్వీస్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు అయినా, హార్ట్ ఎటాక్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించే విధంగా ఈ ఉచిత ఆంబులెన్స్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో దగ్గరలోని ఆస్పత్రికి తరలించేందుకు పూర్తి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కొమటిరెడ్డి చినవెంకటరెడ్డి, సీఐ శివరాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ లింగస్వామి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.