Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-చింతపల్లి
ప్రతీ ఒక్కరూ మల్లన్న స్వామి అనుగ్రహం పొందాలని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలం నేల్వలపల్లి గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుంన్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గుర్రాల మీద ఎక్కి స్వారీ చేయడం అందరిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, యాదాద్రి ఎన్‌ఫ్రా చైర్మెన్ ముచ్చర్ల శ్రీకాంత్‌యాదవ్, సుమతిరెడ్డి, కుంభం శ్రీశైలంగౌడ్, బురుగు రవి, అక్రమ్యాదవ్, మాల్లోజు జగన్, బాదేపల్లి నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.