Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కంచర్ల
నవతెలంగాణ-నల్లగొండ
సంత్ సేవా లాల్ గిరిజనుల ఆరాధ్య దైవం, దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక వేత్త సంత్ సేవాలాల్ అని జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద శుక్రవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ 284 వ జయంతి వేడుకలకు ట్రైకార్ చైర్మెన్ రాంచంద్రనాయక్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ సేవాలాల్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. జిల్లాలో బంజారా భవన్‌కు స్థలం కేటాయింపు కు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా మంత్రి సహకారంతో భవన నిర్మాణంకు నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ జయంతిని 2015 నుండి అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ట్రైకార్ చైర్మెన్ రాంచంద్రనాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మత్తు, ధూమ పానం శాపమని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు దేశంలోనే అందరికీ ఆదర్శపురుషుడయ్యారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ అర్.మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగొని రమేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, తిరుమల గిరి ఎంపీపీ భగవాన్ నాయక్, నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, జిల్లా జైలు సూపరింటెండెంట్ కేతవత్ దేవ్లా, గిరిజన ఉద్యోగ సంఘం అధ్యక్షులు జగన్‌సింగ్, స్థానిక కౌన్సిలర్ ప్రదీప్‌నాయక్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.