Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూరు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోటి 56 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మెరుగైన వసతులు కల్పిస్తుందని, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు పిజి సీట్లుతో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. నియోజకవర్గంలో 12 సబ్ సెంటర్లలో 2.40 కోట్లతో నూతన భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మెన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నకిరేకల్ మార్కెట్ వైస్ చైర్మెన్ పోగుల నర్సింహ్మ, డిప్యూటీ డీఎంహెచ్వో వేణుగోపాల్ రెడ్డి, వైద్యాధికారి శ్వేత, తహసిల్దార్ దేశ్యానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్ కక్కిరేణి వెంకటేశ్వర్లు ఉన్నారు.